మంత్రులకు సుప్రీం నోటీసులకు కారణం మేమే: బొత్స

కాగా అనంతరం బొత్స న్యూఢిల్లీ బయలు దేరి వెళ్లారు. రాజ్యసభకు రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయమై చర్చించేందుకు ఆయన వెళ్లారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా శుక్రవారం వెళుతున్నారు. ఢిల్లీలో ముందుగా ఆజాద్‌తో సిఎం, బొత్స భేటీ అవుతారు. అనంతరం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ వీరు సమావేశం కానున్నారు. అయితే వీరు అధిష్టానం పెద్ధలతో విడివిడిగా భేటీ అవుతారా లేక ఒకేసారి భేటీ అవుతారా తెలియరాలేదు. కాగా ఉప ముఖ్యమంత్రి సి.దామోదర రాజనరసింహ కూడా శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం పిలుపు మేరకు మంత్రి సి.రామచంద్రయ్య కూడా ఢిల్లీ వెళ్లారు. మొత్తానికి రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలందరూ హస్తిన బాట పట్టడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications