ఆదాయం పన్ను పరిమితి రూ.2 లక్షలకు పెంపు

ఎస్‌బి ఖాతాలపై పది నవేలమదుపుపై పన్ను మినహాయింపును ఆయన ప్రకటించారు. వృద్ధులకు, మహిళలకు గరిష్ట ఆదాయం పన్ను పరిమితిని రూ. 2 లక్షలుగా నిర్ధారించారు. పరిశ్రమలకు పన్ను మినహాయింపు కోసం టర్నోవర్ పరిమితి కోటి రూపాయలకు పెంచారు. కార్పొరేట్ పన్ను యధాతథంగా ఉంచారు. రూ. 2 లక్షల బంగారం కొనుగోళ్లపై తక్షణ టిడిఎస్ ఉంటుందని చెప్పారు. సినీ రంగానికి సేవా పన్ను మినహాయించారు. సర్వీస్ టాక్స్, సెంట్రల్ ఎక్స్జైజ్‌కు కామన్ కోడ్ అమలు చేస్తామని చెప్పారు. సేవా పన్ను పరిధి నుంచి విద్య, ప్రభుత్వ సేవలు, వినోదం వంటి 17 సేవలను మినహాయించారు.
వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు ఆయన ప్రత్యేక నిధులు కేటాయించారు. కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయలు సమకూర్చనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే హైదరాబాదులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వంద కోట్ల రూపాయల నిధిని సమకూరుస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications