వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు నిర్బంధం, నాగం ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

By Pratap
|
Google Oneindia TeluguNews

Nagam Janardhan Reddy
మహబూబ్‌నగర్: జిల్లా నాగర్ కర్నూలు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద శనివారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నాగం జనార్దన్ రెడ్డి ఇంట్లోకి మఫ్టీలో ఉన్న ముగ్గురు పోలీసులు ప్రవేశించారు. తాము తనిఖీల కోసం వచ్చామని వారు చెప్పారు. వారి చర్యలకు ఆగ్రహించిన నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులు ఓ కానిస్టేబుల్‌ను నిర్బంధించారు. మరో ఇద్దరు పోలీసులు పారిపోయారు. నాగం జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద మఫ్టీలో ఉన్న పోలీసులు పెద్ద యెత్తున మోహరించారు.

నాగం ఇంట్లో నిర్బంధించిన పోలీసు కానిస్టేబుల్‌ను విడిపించడానికి ఎఎస్పీ వచ్చారు. ఎఎస్పీతో నాగం జనార్దన్ రెడ్డి వాగ్వివాదానికి దిగారు. నాగం జనార్దన్ రెడ్డి మీడియా ప్రతినిధుల సమావేశాన్ని అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ సమయంలో నాగం జనార్దన్ రెడ్డి వర్గీయులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. బయటి నుంచి వ్యక్తులు నాగం ఇంట్లో ఉన్నారా అనే విషయం తెలుసుకోవడానికి తాము వచ్చామని పోలీసులు చెప్పారు. వారి వాదనకు నాగం వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగం ఇంటి వద్ద కార్యకర్తలు రాస్తారోకోకు దిగారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆంధ్రా ఎస్పీని వేశారని, తెలంగాణవాదాన్ని ఓడించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర చేస్తున్నారని నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు. తమపై దురుసుగా ప్రవర్తించినవారిపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై తాము ఈసికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. తన ఇంట్లోనే తనను పోలీసు ఆఫీసర్ తోసేస్తున్నాడని ఆయన అన్నారు. తన అనుచరులపై పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

తెలంగాణపై చంద్రబాబు వైఖరిని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో నాగర్ కర్నూలు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉప ఎన్నికలో నాగం జనార్దన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయనకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు ఇస్తోంది.

English summary
Tension prevailed at independent candidate of Nagar Kurnool, Nagam Janardhan Reddy's residence, as police entered into his house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X