చిచ్చుపెట్టిన బెంగళూరు: కర్ణాటక కేబినెట్ లో బిగ్ వికెట్ డౌన్: మంత్రి రామలింగారెడ్డి రాజీనామా

కర్ణాటక రాజకీయాల్లో ఊహించని సంచలనం చోటుచేసుకున్నది. కేబినెట్ శాఖల కేటాయింపుపై తీవ్ర అసంతృప్తికి లోనైన సీనియర్ కాంగ్రెస్ నేత రామలింగారెడ్డి, తన మంత్రి పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. కొద్దిసేపటి కిందటే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. డీకే శివకుమార్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వానికి.. అధికారంలోకి వచ్చిన మొదటి రోజుల్లోనే ఎదురైన పెద్దదెబ్బ ఇది. మున్ముందు అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉండొచ్చనే అభిప్రాయాలకు తెరతీసింది.

ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో శాఖల కేటాయింపుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు రామలింగారెడ్డి. విధానసౌధలో డీకే శివకుమార్ తో జరిగిన సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చేయడం ఆయన ఆగ్రహానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర రాజధాని సమగ్ర అభివృద్ధికి అత్యంత కీలకమైన, రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన బెంగళూరు డెవలప్‌మెంట్ పోర్ట్‌ఫోలియోను ఆయన ఆశించారు.

Minister Ramalinga Reddy Resign from Cabinet After Denied the Bengaluru Development Portfolio Snub

ఈ శాఖను కృష్ణ బైరేగౌడకు కేటాయించారు డీకే శివకుమార్. గత సిద్ధరామయ్య మంత్రివర్గంలో డీకేశి స్వయంగా ఈ శాఖను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. దీన్ని బైరేగౌడకు కేటాయించి, రామలింగా రెడ్డికి భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖను అప్పగించారు. ఇది ఆయనను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీంతో మంత్రివర్గం నుంచి తప్పుకొంటోన్నట్లు ప్రకటించారు. కొద్దిసేపటి కిందటే విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

తన రాజీనామా పత్రాన్ని డీకే శివకుమార్ కు పంపించినట్లు తెలిపారు. ఇందులో అన్ని విషయాలనూ పొందుపర్చానని చెప్పారు. రాజీనామా లేఖలో.. "నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి, మీకు కృతజ్ఞతలు. నేను నా ఆత్మసాక్షికి వ్యతిరేకంగా వ్యవహరించలేను. నా ఆత్మసాక్షికి అనుగుణంగా మీరు తీసుకున్న నిర్ణయాలు లేవు. నా రాజీనామాను దయచేసి ఆమోదించండి. ఇకపై నేను కేవలం ఎమ్మెల్యేగా, పార్టీ కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తాను" అని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా గతంలో తనకు ఇచ్చిన హామీని కూడా డీకే శివకుమార్ కు గుర్తు చేశారు రామలింగారెడ్డి. 2023లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడే బెంగళూరు డెవలప్‌మెంట్ శాఖను తనకు ఇస్తామని హామీ ఇచ్చారని, ఆ మాట నెరవేరకపోవడం వల్లే తాను ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన నేత మంత్రివర్గం నుంచి వైదొలగడం, ప్రభుత్వానికి సంకట స్థితిని తెచ్చిపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+