వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 ఎన్నికలు: నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Narendra Modi
వాషింగ్టన్: 2014లో వచ్చే లోకసభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెసు యువనేత, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయుడు రాహుల్ గాంధీకి సవాల్ విసిరే అవకాశం ఉందని టైమ్ మ్యాగజైన్ రాసింది. ప్రతిష్టాత్మకమైన టైమ్ మ్యాగజైన్ ఆసియా సంపుటి కవర్ పేజీపై నరేంద్ర మోడీ చిత్రాన్ని ప్రచురించింది. ఈ పత్రిక శుక్రవారం మార్కెట్లోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెసు విఫలమైన నేపథ్యంలో రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీ సవాల్ విసిరే అవకాశం ఉందని ఆ పత్రిక రాసింది.

వచ్చే ఎన్నికల నాటికి పార్టీని రాహుల్ గాంధీ గాడిలో పెడతారని కాంగ్రెసు నాయకులు భావించారని, అయితే ఉత్తరప్రదేశ్ ఎన్నికల తర్వాత రాహుల్ పరిస్థితి దయనీయంగా మారిందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది. మోడీ అంటే బిజినెస్, కానీ భారత్‌కు నాయకత్వం వహించగలడా అనే శీర్షిక పెట్టి గడ్డంతో సీరియస్‌గా ఉన్న మోడీ బొమ్మను ఆ పత్రిక ప్రచురించింది.

బహుశా, 61 ఏళ్ల వయస్సు గల మోడీకి మాత్రమే రాహుల్ గాంధీని సవాల్ చేయగల గుర్తింపు, ట్రాక్ రికార్డు ఉందని వ్యాఖ్యానించింది. మోడీ ఇంటర్వ్యూను కూడా పత్రిక ప్రచురించింది. మోడీ నాయకత్వంలో గుజరాత్ సాధించిన అభివృద్ధిని పత్రిక వివరించింది. పారిశ్రామిక రంగంలో గుజరాత్ ముందుకు సాగుతోందని, పెట్టుబడులకు ఆకర్షణీయమైన ప్రాంతంగా మారిందని చెప్పింది.

English summary
Gujarat chief minister Narendra Modi may pose a challenge to Congress's young scion Rahul Gandhi in India's next parliamentary elections, Time magazine said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X