హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ, అవినీతి: సభలో దుమారం, నిలదీసిన బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Chandra Babu Naidu
హైదరాబాద్: అవినీతిపై చర్చించాలని విపక్షాలు పట్టు పట్టడం సభలో దుమారం రేపింది. దీంతో స్పీకర్ సోమవారం సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఉదయం సభ ప్రారంభమయ్యాక మొదటిసారి పదిహేను నిమిషాలు వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభమైంది. స్పీకర్ సకల జనుల సమ్మె సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, విద్యార్థులపై కేసులు ఎత్తివేతపై చర్చించేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి నేత ఈటెల రాజేందర్, సిపిఐ నేత గుండా మల్లేష్, సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని సూచించారు. ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ.. కేసులు ఉద్యోగులు, విద్యార్థులపై కేసులు ఎత్తివేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు. అయితే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయన్నారు. చట్టపరమైన సమస్యలు అధిగమించి వాటిని ఎత్తి వేస్తామని చెప్పారు. విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం కేసులు ఎత్తివేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం కాలపరిమితి పెట్టుకొని త్వరగా కేసులు ఎత్తి వేయాలని గుండా మల్లేష్ కోరారు. విద్యార్థుల ఎత్తివేతకు సత్వర చర్యలు తీసుకుంటామని హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి హామీ ఇచ్చారు.

అనంతరం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసుల అంశంపై చర్చించాలని తాము వారం రోజులుగా కోరుతున్నా ప్రభుత్వం ముందుకు రావడం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జివోలను స్పీకర్ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. అవినీతి అంశం చాలా సీరియస్ విషయమని ప్రభుత్వం దీనిని తేలిగ్గా తీసుకుంటోందని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసి అన్నారు. అవినీతి అంశంపై తాము తొలిసారి విపక్షానికి మద్దతిస్తున్నామని చెప్పారు. అవినీతిపై అధికార, విపక్షాలకు చిత్తశుద్ధి లేదని విమర్సించారు. అవినీతిపై చర్చించాల్సిందేనని పట్టుబట్టారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలతో సభలో దుమారం రేగింది. దీంతో స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

English summary
Speaker Mallu Bhatti Vikramarka adjourned Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X