హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు స్థిరాస్థి రూ.24 కోట్లు, సిఎం రమేష్‌కు అత్యధికం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi-Devender Goud
హైదరాబాద్: రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలలో తమ తమ ఆస్తుల వివరాలు అందించారు. సోమవారం నామినేషన్ దాఖలు చేసిన ఆరుగురు రాజ్యసభ సభ్యులలో తెలుగుదేశం పార్టీ నేత సిఎం రమేష్ అత్యధిక ఆస్తి కలిగి ఉండగా కాంగ్రెసు నేత రాపోలు ఆనంద భాస్కర్ అత్యల్ప ఆదాయం కలిగి ఉన్నారు. అత్యధిక ఆస్తి కలిగిన సిఎం రమేష్ ఆస్తి రూ.120 కోట్ల 24 లక్షల 40 వేలు. ఆయన భార్య పేర రూ.29 కోట్ల 41 లక్షలు ఉన్నాయి. రమేష్ పేరు మీద నగరు 2 కిలోలు, భార్య పేరుమీద 3.5 కిలోలు ఉన్నాయి. ఇన్నోవా, కోరల్లా, బిఎండబ్లు కార్లు ఉన్నాయి. ఆభరణాలు 5.5 కిలోలు ఉన్నాయి. కాగా రమేష్ అప్పులు రూ.13 కోట్లు, భార్య పేరిట రూ.మరో కోటి ఉన్నాయి.

మరో టిడిపి నేత దేవేందర్ గౌడ్ ఆస్తులు రూ.1.92 కోట్లు ఉన్నాయి. ఆయన భార్య పేర రూ.1.16 కోట్లు ఉండగా, బంజారాహిల్సులో 1600 చ.గ.ల స్థలం ఉంది. రెండు అంబాసిడర్ కార్లు, ఒక హోండా కారు ఉన్నాయి. రెండు కిలోల బంగారం, పది కిలోల వెండి ఉంది. శంషాబాద్‌లో భార్య పేర 5 ఎకరాల భూమి.

కాంగ్రెసు అభ్యర్థుల విషయానికి వస్తే.. చిరంజీవి పేరిట స్థిరాస్థి రూ.24.76 కోట్లు ఉంది. ఆయన పేరు మీద క్యాష్ బ్యాండ్లు రూ.16 కోట్లు, హోండా సిఆర్వీ కారు, భార్య పేర రూ.40.86 కోట్ల నగదు, రూ.15 కోట్ల క్యాష్ బాండ్లు, హోండా అకార్డ్ ఉన్నాయి. బంగారం 13.5 కిలోలు, వెండి 22 కిలోలు, 88 కేరెట్ల వజ్రాలు ఉన్నాయి. చిరంజీవి అప్పులు రూ.3.5 కోట్లు ఉన్నాయి.

రాపోలు ఆనంద భాస్కర్ ఆస్తులు రూ.7.5 లక్షల లోపే ఉన్నట్లు తెలుస్తోంది. నగదు రూ.30 వేలు, రూ.50 వేలు బాండ్లు, భార్య పేరిట రూ.22 వేలు, కొడకండ్లలో రూ.50వేల ఇళ్లు, 600 గజాల ఇంటి స్థలం ఉంది. ద్విచక్ర వాహనం మాత్రమే ఉంది.

రేణుకా చౌదరి స్థిరాస్థి రూ.24.33 కోట్లు ఉన్నాయి. భర్త పేరిట రూ.21.68 కోట్లు ఉన్నాయి. ఎలాంటి వాహనాలు లేవు. రూ.15 లక్షల విలువైన బంగారం ఉంది.

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆస్తులు రూ.1.70 కోట్లు ఉన్నాయి. భార్య పేరిట రూ.44 లక్షలు ఉన్నాయి. అప్పులు రూ.9.5 లక్షలు ఉన్నాయి. వాహనాలు లేవు.

English summary
Rajya Sabha candidates announced their properties in their nominations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X