హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నా కుటుంబం పోటీ చేయదు, అందుకే పదవి: చిరంజీవి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
హైదరాబాద్: తాను రాజ్యసభకు వెళితే తిరుపతి నియోజకవర్గంలో తన కుటుంబ సభ్యులు పోటీ చేస్తారనే ప్రచారాన్ని చిరంజీవి సోమవారం కొట్టిపారేశారు. నామినేషన్ వేసిన అనంతరం చిరంజీవి, రేణుకా చౌదరి, పాల్వాయి గోవర్దన్ రెడ్డి, ఆనంద భాస్కర్ విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో కుటుంబ సభ్యులు అనే ప్రస్తావనే లేదని తేల్చి చెప్పారు. అవన్నీ మీడియా ఊహాగానాలేనని అన్నారు. భవిష్యత్తులో ఉండవచ్చునని మీకు అనుమానాలు ఉండవచ్చునని, కానీ నేను ఉండదు అని ఖచ్చితంగా చెబుతున్నానని అన్నారు. ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలో తాను మద్దతు పలికి ప్రభుత్వాన్ని గట్టెక్కించినందుకే ఇంప్రెస్ అయి రాజ్యసభ సీటు ఇచ్చి ఉంటారన్నారు. ప్రస్తుతం రాజ్యసభ పొందిన వారిది వేరు తనది వేరన్నారు. ప్రజాస్వామ్యంలో నా వంతు బాధ్యత నిర్వర్తించానని చెప్పారు. తన పట్ల అధిష్టానం చూపిస్తున్న అభిమానానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. వారు ఏ నమ్మకంతో నాకు పదవి ఇచ్చారో అదే దిశగా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

2014లో కాంగ్రెసు పార్టీ విజయం కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. ఇది తమకు అత్యంత కీలకమైన సమయం అన్నారు. ప్రస్తుతం పార్టీలో నైరాశ్యం ఉందని, దానిని తొలగించి కార్యకర్తలను ప్రోత్సహించాల్సి ఉందన్నారు. రాజ్యసభ బహుమతి కాదని బాధ్యత అన్నారు. దీనిని తాను పదోన్నతిగా భావిస్తున్నానన్నారు. నాకు రాజకీయంగా మద్దతిచ్చిన తిరుపతిని తాను ఎప్పుడూ మరిచి పోనని అన్నారు. ఆ నియోజకవర్గానికి ఎప్పుడూ రుణపడి ఉంటానని హామీ ఇచ్చారు. ఎక్కడ ఉన్నా తిరుపతిని మరిచిపోనని, దానిని సొంత నియోజకవర్గంగా చూసుకుంటానని, అభివృద్ధికి పాటు పడతానన్నారు. తిరుపతితో తనకు అవినాబావ సంబంధముందన్నారు. పార్టీని నమ్ముకొని కరెక్టుగా పని చేస్తే గుర్తింపు వస్తుందని ఆనంద భాస్కర్‌ను చూస్తే అర్థమవుతోందన్నారు.

చిరంజీవి చెప్పినట్టు రాజ్యసభ తమకు బహుమతి కాదని బాద్యత అన్నారు. కాంగ్రెసు పార్టీ 125 ఏళ్లలో ఎన్నో గెలుపోటములు చవి చూసిందని అన్నారు. గెలుపోటములు మాకు కొత్త కాదన్నారు. ఓ సమయంలో కాంగ్రెసు ప్రాంతీయ పార్టీ స్థాయికి పోతోందని విమర్శించారని, కానీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో పార్టీ ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నామన్నారు. కాంగ్రెసులో కష్టపడి పని చేసిన వారికి సముచిత న్యాయం దొరుకుతుందనడానికి ఇది నిదర్శనమని చీప్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. చిరంజీవి అట్రాక్షన్ గా మాకు ఉన్నారన్నారు. అన్ని వర్గాలను కలుపుకొని వెళతామన్నారు. రాష్ట్రంలో పార్టీని బలపర్చేందుకు కృషి చేస్తానని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు.

English summary
Tirupati MLA Chiranjeevi said that his family members will not contest from Tirupati constituency in byelections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X