జీవితమంతా నోట్లు, వెన్నుపోట్లే: బాబుపై కెటిఆర్ ఫైర్

తెలంగాణపై వారు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలన్నారు. తాము ఉప ఎన్నికల కోసమే సభకు రావడం లేదని చెప్పి మరీ వెళ్లామని, కానీ కాంగ్రెసు, టిడిపిలు మాత్రం అలా చెప్పే ధైర్యం చేయలేక పోయాయన్నారు. వారు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని సభా సమయం వృథా చేశారన్నారు. సభను ప్రచారం కోసం వంతుల వారిగా వాయిదా వేశారని ఆరోపించారు. ఈ నెల 21న ఫలితాలు వస్తాయని అప్పుడు మరింత మాట్లాడతామని చెప్పారు. అవినీతికి పాల్పడుతున్న ఆ రెండు పార్టీలకు దానిపై మాట్లాడే హక్కు లేదన్నారు. 2009 సాధారణ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అధికారంలోకి రావడానికి కారణం వైయస్ అవినీతేనని ఆరోపించారు. చంద్రబాబు అన్నా హజారేకు బంధువులా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బాబుకు నిజాయితీ, చిత్తశుద్ధి లేదన్నారు.












Click it and Unblock the Notifications