హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపే లెక్కింపు: కోవూరుపై ఉత్కంఠ, తెలంగాణ సీట్లపై ఆసక్తి

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: రాష్ట్రంలోని ఏడు స్థానాల ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ప్రారంభం కానుంది. దీంతో బుధవారంనాడే అన్ని పార్టీల స్థితిగతులు బయటపడుతాయి. కోవూరు శాసనసభా నియోజకవర్గం ఫలితాన్ని బట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ భవిష్యత్తు తేలనుందని అంటున్నారు. కోవూరులో ఆయన పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయంపైనే త్వరలో 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ప్రసన్నకుమార్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిస్తే త్వరలో జరిగే 18 స్థానాల ఉప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఊపు వస్తుందని చెబుతున్నారు.

కాగా, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సాధించే ఓట్ల శాతాన్ని బట్టి ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఐదు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థులు, ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి గెలుచుకుంటారని చెబుతున్నారు. అయితే, ఈ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని తెరాస ప్రచారం సాగిస్తూ వచ్చింది. అయితే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకటి రెండు చోట్ల రెండో స్థానంలో వచ్చి, మెజారిటీ స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకుంటే భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వ్యూహం పదునెక్కుతుందని చెబుతున్నారు.

కాగా, కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏ మాత్రం బాగా లేదని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ మెజారిటీ స్థానాల్లో మూడో స్థానంలో నిలిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇరకాటంలో పడాల్సి వస్తుందనే మాట వినిపిస్తోంది. ఈ ఏడు స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులు సాధించే ఓట్లపైనే వచ్చే 18 స్థానాల ఉప ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కుంటుందనే విషయంపై అంచనా ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఏమైనా, అన్ని పార్టీలకు ఈ ఉప ఎన్నికలు భవిష్యత్తును నిర్ధారించేవిగానే ఉన్నాయి. తెలంగాణ అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీ రెండో స్థానంలో నిలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

English summary
Counting of votes for seven assembly seats will be held tomorrow, These results will decide the fate of political parties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X