హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఆస్తుల కేసులో మోపిదేవిని విచారించిన సిబిఐ

By Pratap
|
Google Oneindia TeluguNews

Mopidevi Venkataramana
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు మంత్రి మోపిదేవి వెంకటరమణను మంగళవారం విచారించారు. హైదరాబాదులోని దిల్‌కుషా అతిథి గృహంలో నాలుగు గంటలపాటు వారు మోపిదేవిని విచారించారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మోపిదేవి వెంకటరమణ మౌలిక సదుపాయాల కల్పనా మంత్రిగా పనిచేశారు. ముఖ్య కార్యదర్శి మన్మోహన్ సింగ్‌ను కూడా సిబిఐ అధికారులు విచారించారు. భూముల కేటాయింపుపైనే సిబిఐ అధికారులు విచారించినట్లు మోపిదేవి వెంకటరమణ మీడియా ప్రతినిధులతో చెప్పారు. విచారణ కొనసాగుతున్నందున వివరాలు అందించలేనని ఆయన అన్నారు.

జీవోల జారీ గురించి వివరాలు అడిగినట్లు ఆయన తెలిపారు. మళ్లీ సిబిఐ పిలిస్తే విచారణకు హాజరవుతానని ఆయన చెప్పారు. నలుగురు అధికారులతో కలిపి తనను సిబిఐ అధికారులు విచారించినట్లు ఆయన తెలిపారు. గతంలోనే సిబిఐ నోటీసులు ఇచ్చినా ఉప ఎన్నికల కారణంగా మంత్రి హాజరు కాలేదు. మంగళవారం హైదరాబాదులో ఉండడంతో ఆయన సిబిఐ విచారణకు హాజరయ్యారు. వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ అధికారులు జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డిని అరెస్టు చేశారు.

కాగా, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. నిందితులందరి పట్ల సిబిఐ ఒకే విధంగా వ్యవహరించడం లేదని, చార్జిషీట్‌‌ దాఖలు చేసిన తర్వాత కోనేరుకు బెయిల్ మంజూరు చేయకపోవడం అభ్యంతరకరమని ఆయన తరఫు న్యాయవాది అన్నారు. కొందరిని అరెస్టు చేసి, మరికొందరికి బెయిల్ ఇవ్వకపోవడం సరి కాదని ఆయన అన్నారు. ఇదే కేసులో బిపి ఆచార్యకు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు ఆచార్య తరఫు న్యాయవాది కోర్టును గడువు కోరారు.

English summary
CBI grilled minister Mopidevi Venkataramana in YSR Congress president YS Jagan assets case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X