అరెస్ట్ కాకుండా జగన్ ఒప్పందం: టిడిపి, ఆస్తిపై సవాల్

జగన్ ఓ దొంగ అని ధ్వజమెత్తారు. తండ్రి హయాంలో కోట్లు దోచుకుని ఇప్పుడు తన చేతికి తాళాలు ఇవ్వమని అడుగుతున్నాడని విమర్శించారు. జగన్ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులు తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు జగన్ ప్రధానితో ఏం మాట్లాడారో చెప్పాలన్నారు. తనను సిబిఐ అరెస్టు చేయకుండా కాంగ్రెసుతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఆరోపించారు. వాన్ పిక్ కోసం ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములు తీసుకున్నారన్నారు. చంద్రబాబుకు కనీసం రెండు ఎకరాలైనా ఉంది కానీ మీకు సెంట్ భూమి కూడా లేదని అన్నారు. సెంట్ భూమి లేకుండా లక్ష కోట్లకు ఎలా ఎదిగావని ప్రశ్నించారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొవూరు నియోజకవర్గంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించి అక్కడి ప్రజలు తెలియక అవినీతిని ప్రోత్సహించారని అన్నారు. నల్లపురెడ్డి గెలిచినప్పటికీ ఆ పార్టీ కార్యకర్తలు మాత్రం ఆయన మెజార్టీపై జోరుగా బెట్టింగులు కట్టి రోడ్డున పడ్డారన్నారు. దీనికి కారణం విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్, జగన్ అన్నారు. రానున్న పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి గణనీయంగా మెరుగు పడుతుందన్నారు.












Click it and Unblock the Notifications