చంద్రబాబుకు రాజ్యసభ, తెలంగాణ సెగలు తప్పవా?

కాగా, సీమాంధ్రకు చెందిన నాయకులు వచ్చే ఉప ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచి చూడాలనే ఉద్దేశంతో ఉన్నట్లు చెబుతున్నారు. తిరుపతితో సహా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గం శాసనసభ్యుల వల్ల ఖాళీ అయిన 17 స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. కోవూరు ఉప ఎన్నిక ఫలితంతో ఇప్పటికే పార్టీ అసమ్మతి గూడు కట్టుకున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఉప ఎన్నికల్లో పార్టీ తగిన ఫలితాలు సాధించకపోతే చంద్రబాబుపై పలువురు సీనియర్లు తిరుగుబాటు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కాగా, తెలంగాణ నాయకులు కూడా చంద్రబాబుపై సమరానికి సమాయత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం వల్ల తెలంగాణలో పార్టీ పూర్వ వైభవాన్ని సాధించే స్థితిలో లేదని అంటున్నారు. తెలంగాణలో బలం పుంజుకోవడానికి తాము ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం అంతగా ఉండడం లేదని, పైగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కాంగ్రెసును వదిలేసి తమనే ప్రధానంగా టార్గెట్ చేసుకుందని, దీనివల్ల పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ స్థితిలో తెలంగాణకు చెందిన కొంత మంది నాయకులు చంద్రబాబు వైఖరిని ప్రశ్నిస్తూ లేఖాస్త్రాలు సంధించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. వేణుగోపాలాచారి వంటి నాయకులు అందుకు నడుం బిగించవచ్చునని తెలుస్తోంది. అటువంటి నాయకులతో తెరాస నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే, రాజీనామాలు చేయకుండా చంద్రబాబు వైఖరిపై సమరం సాగించాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications