ఏప్రిల్ రెండోవారంలో చిరంజీవికి మంత్రి పదవి

Chiranjeevi
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి పదవి కోసం మెగాస్టార్ చిరంజీవి ఏప్రిల్ రెండో వారం దాకా ఆగాల్సిందే. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏప్రిల్ రెండోవారంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవికి అవగాహన ప్రకారం కేంద్ర మంత్రి పదవిని ఇవ్వాల్సి ఉంటుంది. చిరంజీవితో పాటు మరో ఇద్దరికి రాష్ట్రం నుంచి మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్రానికి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

2009 ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేశారు. అప్పుడు రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అనుసరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఎస్ జైపాల్ రెడ్డి ఒక్కరే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు. అయితే, రాష్ట్రానికి చెందిన మిగతావారంతా సహాయ మంత్రులు కాగా, జైపాల్ రెడ్డి ఒక్కరిదే క్యాబినెట్ హోదా. అయినా సరే, తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన పార్లమెంటు సభ్యుడు హరీష్ రావత్‌కు కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+