వైయస్ జగన్‌ను ఎదుర్కునే దుమ్ము లేదు: జీవన్ రెడ్డి

Jeevan Reddy
కరీంనగర్/ హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము సీమాంధ్రలో తమ పార్టీకి లేదని కాంగ్రెసు సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెసుకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని ఎదుర్కునే సత్తా ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. మహబూబ్‌నగర్‌లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని ఆయన అన్నారు.

దివంగత శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి సతీమణికి టికెట్ ఇచ్చి ఉంటే కాంగ్రెసు గెలిచి ఉండేదని ఆయన అన్నారు. ఈ విషయంపై తాను పార్టీ అధిష్టానానికి లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం తగ్గిందని చెప్పడానికే ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌లో బిజెపి విజయానికి సహకరించారని ఆయన విమర్సించారు. తెలంగాణావాదాన్ని దెబ్బ తీసేందుకే తెరాసను ముఖ్యమంత్రి ఓడించారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలకు పార్టీపై విశ్వాసం పెరగాలంటే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

పార్టీ సీనియర్లు చేసిన పోరాటం వల్లనే కనీసం పార్టీ తెలంగాణ పోటీ చేసే వాతావరణమైనా ఏర్పడిందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీలు కెఆర్ అమోస్, యాదవ రెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రచారం చేయాలని తమను ఎవరూ అడగలేదని, ఓటమి చవి చూసిన తర్వాత సీనియర్లు ప్రచారం చేయలేదని విమర్శిస్తున్నారని వారు విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై కేంద్రం వెనకడుగు వేయడం వల్లనే ప్రజలు తమ పార్టీని విశ్వసించలేదని వారు అభిప్రాయపడ్డారు. తాము త్వరలో ఢిల్లీకి వెళ్తామని వారు చెప్పారు. తెలంగాణ మంత్రులు పదవులు వదిలిపెడితేనే తెలంగాణ వస్తుందని వారన్నారు. మంత్రులు తెలంగాణపై పార్టీ అధిష్టానానికి వాస్తవాలు చెప్పాలని, లేదంటే మంత్రి పదవుల నుంచి తప్పుకోవాలని వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+