విద్యార్థి ఆత్మహత్య, రేపు 25న తెలంగాణ బంద్

న్యూ సైన్స్ కాలేజి విద్యార్థి అయిన భోజ్యా నాయక్ శనివారం సాయంత్రం కళాశాల ఆడిటోరియం సమీపంలో నిప్పు అంటించుకుని జై తెలంగాణ అంటూ నినాదాలు చేస్తూ కుప్పకూలిపోయాడు. అటుగా వెళ్తున్నవారు క్రింద పడిపోయిన భోజ్యా నాయక్‌ను చూసి పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే వరంగల్ ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని శరీరం 90 శాతం కాలిపోయినట్టు తెలుస్తున్నది. ఆస్పత్రిలో వైద్యులు ఎంతో కష్టపడినా భోజ్యా దక్కలేదు.
తెలంగాణ ఉద్యమంలో బోజ్యా నాయక్ మొదటినుంచీ చురుకుగా పాల్గొంటున్నారు. విద్యార్థినీ విద్యార్థులు ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. కొట్లాడి తెలంగాణ సాధించుకుందమని ఆయన అన్నారు. తెరాస నాయకులు వినయ్ భాస్కర్, రాజయ్య, పాపిరెడ్డి, అప్పారావు, వినోద్ ప్రభృతులు ఆస్పత్రిలో చికిత్స జరుగుతున్న సమయంలో భోజ్యా నాయక్‌ను పరామర్శించారు. ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణకు అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో బోజ్యా నాయక్ ఆత్మహత్య కలిచి వేస్తోంది.












Click it and Unblock the Notifications