హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మాటలకు ప్రజలు అవాక్కు: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: అవినీతిని అంతమొందిస్తానంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర ప్రజలు అవాక్కయ్యారని కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి. హనుమంత రావు అన్నారు. జగన్ ఏమిటి ఈ మాటలు చెబుతున్నాడేమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని, అవినీతి కార్యక్రమాలపై ముందు జగన్ కోర్టుకు వివరణ ఇవ్వాలని, ఆ తర్వాతనే అవినీతిని అంతమొందిస్తానని చెప్పాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు

రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై మేధోమథనం జరగాల్సిందేనని విహెచ్ అన్నారు. ఎన్నికల ఫలితాలకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలదే బాధ్యత అని వీహెచ్ స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆజాద్ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన అన్నారు. 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహాలను రచించాలని, లేదంటే కష్టమేనని వీహెచ్ ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటక, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారన్నారు.

సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ అధ్యక్షుడు సమావేశమై ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఎంత వరకు నెరవేరుతున్నాయో సమీక్షించుకోవాలని వీహెచ్ సూచించారు. రాష్ట్ర పరిణామాలన్నీ అధిష్ఠానం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. ఉప ఎన్నికల ఫలితాలకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు రాజీనామా చేయాలా? వద్దా? అనే అంశాన్ని అధిష్ఠానం ఆలోచిస్తుందన్నారు.

English summary
Congress senior leader V hanumanth Rao has fired at YSR Congress president YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X