తిరుపతిని మరవను: చిరంజీవి, కాన్వాయ్‌లో అపశృతి

chiranjeevi
తిరుపతి/శ్రీకాకుళం: తాను తిరుపతి నియోజకవర్గాన్ని మరిచిపోనని ఆ నియోజకవర్గ శాసనసభ్యుడు, ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి ఆదివారం చెప్పారు. తిరుపతి నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ సాధ్యమైనంత మేర తన సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. నాలుగు నెలల్లో తాను రూ.45 లక్షలతో షాదీమహల్‌లు నిర్మిస్తానని హామీ ఇచ్చారు. జీవితాంతం తిరుపతి ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. పదవి ఉన్నా లేకపోయినా తిరుపతిపై దృష్టి సారిస్తానని అన్నారు. ఏ నియోజకవర్గంకు చేయని అభివృద్ధిని తిరుపతికి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల రుణం తీర్చుకోవడమే తన ముందున్న లక్ష్యమన్నారు. కాగా చిరంజీవి కాన్వాయ్‌లో స్వల్ప అపశృతి చోటు చేసుకుంది. ఆయన కాన్వాయ్ వెళుతుండగా అందులోని ఒక వాహనం పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి తిరుపతి వచ్చారు.

కాగా అంతకుముందు ఉదయం శ్రీకాకుళం జిల్లాలోనూ మంత్రి ధర్మాన ప్రసాద రావు కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. ఉదయం ధర్మాన శ్రీకాకుళంలోని ఓ కాలనీలో సిసి రోడ్డు ప్రారంభోత్సవానికి వెళుతున్నారు. ఆ సమయంలో ధర్మాన కాన్వాయ్‌లోని ఓ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పైన ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే రిమ్స్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. కాగా వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు చెప్పినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+