కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలను తిరగనివ్వం: కోదండరామ్

ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకట రమణా రెడ్డి వైఖరి వల్లే ఆత్మహత్యలు జరుగుతున్నాయని హరీష్ రావు అన్నారు. బాధ్యులను వెంటనే ప్రభుత్వం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పదవులు వద్దు తెలంగాణ కావాలన్న గండ్ర ఇప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు కోసం తెలంగాణవాదం తగ్గుతోందని అంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో ఆత్మహత్యపై పట్టుబడతామని అన్నారు. టిడిపి, కాంగ్రెసు తెలంగాణపై మోసం చేస్తోందని మండిపడ్డారు. కాగా బోజ్యా నాయక్‌ది ఆత్మహత్య కాదని కాంగ్రెసు హత్య అని తెలుగుదేశం పార్టీ నేత కడియం శ్రీహరి వేరుగా అన్నారు. ఈ పార్లమెంటు సమావేశాలలోనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications