బాబుపై పోటీకి సై, జగన్‌ను చిరు ఆపలేరు: లక్ష్మీపార్వతి

Laxmi Parvathi
ఏలూరు: వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తాను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పంలో పోటీ చేస్తానని ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ఆదివారం ఏలూరులో అన్నారు. తాను ఆత్మహత్య చేసుకునేందుకు అయినా సిద్ధం కానీ తెలుగుదేశం పార్టీలో చేరేది మాత్రం లేదని స్పష్టం చేశారు. తాను వైయస్ జగన్ పార్టీలో చేరలేదని, కేవలం ఆయన తరఫున ప్రచారం మాత్రమే పాల్గొంటున్నానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని చెప్పారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అని ఆమె జోస్యం చెప్పారు. ఉప ఎన్నికలు జరగనున్న పద్దెనిమిది నియోజకవర్గాలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని అన్నారు. తిరుపతి శాసనసభ్యులు చిరంజీవి లాంటి వారు వంద మంది వచ్చినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో త్వరలో తాను బయటకు తీస్తానని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+