బాబు,కిరణ్ ప్రయత్నించినా తగ్గించలేకపోయారు: నాగం

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు శతవిధాలా ప్రయత్నించినా ఉప ఎన్నికల్లో తెలంగాణవాదాన్ని తగ్గించలేక పోయారన్నారు. తెలంగాణ వాదం లేదని చెప్పేందుకు వారు ఉప ఎన్నికల్లో గెలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారని, కానీ ఓడిపోయారన్నారు. ఉప ఎన్నికల్లో తెలంగాణవాదం అన్నింటినీ అధిగమించిందని చెప్పారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న బోజ్యనాయక్ కుటుంబానికి నాగం జనార్దన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.












Click it and Unblock the Notifications