చిత్తూరులో ఘోరం:యువకుడి ప్రాణం తీసిన క్రికెట్ సరదా

Chittoor Map
చిత్తూరు: జిల్లాలో ఆదివారం దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. చిత్తూరు జిల్లాలోని నగిరి మండలంలోని అడవి కొత్తూరులో జరిగింది. అడవి కొత్తూరు, రాజుల కండ్రిగ జట్ల మధ్య క్రికెట్ జరుగుతున్న సమయంలో ఇరు జట్లకు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. ఈ వాగ్వాదం కాస్త ముదిరి ఉద్రిక్తతకు దారి తీసింది. ఇరు జట్ల మధ్య జరిగిన ఈ ఘర్షణలో వినాయక్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన వినాయక్ అడవి కొత్తూరు జట్టుకు చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. అతని మృతితో అక్కడ విషాదఛాయలు అంటున్నాయి.

కాగా ఖమ్మం జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. జిల్లాలోని వెంకాయపాలెం గ్రామంలో ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో మహిళ మృతి చెందింది. గాయపడ్డ వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా సికింద్రాబాద్‌లోని మారెడ్‌పల్లిలో ఓ సెక్యూరిటీ సంస్థకు చెందిన సెక్యూరిటీ గార్డు హత్యకు గురయ్యాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+