బిపి ఆచార్యకు షాక్, బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు

అయితే, ప్రత్యేక కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ హైకోర్టుకు వెళ్లింది. సిబిఐవాదనలు వినకుండా నాంపల్లి ప్రత్యేక కోర్టు ఆచార్యకు బెయిల్ ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసు విచారణ జరుగుతుండగా ఆచార్యకు బెయిల్ ఇవ్వడం సరి కాదని అభిప్రాయపడింది.
ఎమ్మార్ కుంభకోణం కేసులో అరెస్టయిన సునీల్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో హైకోర్టు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది. మరోవైపు ఇదే కేసులో కోనేరు ప్రసాద్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.