వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సురవరం సుధాకర రెడ్డి చేతికి సిపిఐ పగ్గాలు

సురవరం సుధాకర రెడ్డి 1942 మార్చి 25వ తేదీన మహబూబ్‌నగర్‌లో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కర్నూలులో జరిగింది. ఇప్పటి వరకు సుధాకర రెడ్డి సిపిఐ ఉప ప్రధాన కార్యదర్సిగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా కూడా రెండ దఫాలు ఆయన పనిచేశారు. సిపిఐ అనుబంధ సంఘాలు ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా ఆయన పనిచేశారు. 2008లో హైదరాబాదులో జరిగిన సిపిఐ 20వ జాతీయ మహాసభల్లో ాయన పార్టీ ఉప ప్రధాన కార్యదర్సిగా ఎన్నికై ఇప్పటి వరకు కొనసాగుతున్నారు. ఆయన సతీమణి బివి విజయలక్ష్మి బ్యాంక్ అధికారిగా పదవీ విరమణ చేసి, పార్టీ కోసం పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు.