అందరికీ తెలుసు, ఆశ కాదు: తిరుపతి టిక్కెట్‌పై గల్లా

అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. తిరుపతి అసెంబ్లీ సీటుపై మాకు ఆశ కాదన్నారు. ప్రజా సేవ కోసమేనని చెప్పారు. తన తనయుడు గల్లా జయదేవ్ కాంగ్రెసు పార్టీకి చెందిన నేతనే అన్నారు. అందుకే తాము టిక్కెట్ కోసం అడుగుతున్నామని చెప్పారు. అయితే తుది నిర్ణయం అధిష్టానానిదేనని ఆమె చెప్పారు. అధిష్టానం ఎవరికి టిక్కెట్ ఇచ్చినా తాను కాంగ్రెసు పార్టీ నేతగా గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డికి ఇక్కడి పరిస్థితులు తెలియనివి ఏముంటాయని అన్నారు. తన కొడుకుకు టిక్కెట్ కోసం పదే పదే వారి వెంట తిరిగే రకం తాను కాదన్నారు. మేమంతా కాంగ్రెసు కుటుంబం వ్యక్తులమే అన్నారు. గల్లా జయదేవ్‌కు ఇష్టం ఉందని, అందుకే ఆయనను ప్రమోట్ చేయాలని తాము భావిస్తున్నామని అన్నారు. ఇక్కడ ఎవరు స్థానికులో ఎవరు స్థానికులు కాదో అందరికీ తెలుసునని అన్నారు. అవకాశం వచ్చింది కాబట్టి తాము టిక్కెట్ ఇవ్వాలని అడుగుతున్నామని చెప్పారు.
కాగా ఉదయం చిత్తూరు జిల్లాకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి స్థానం టిక్కెట్ ఎవరికి కేటాయించాలో జిల్లాకు చెందిన నేతలతో చర్చిస్తున్నారు. గెలిచే అభ్యర్థికే టిక్కెట్ ఇస్తామని ఆయన చెప్పారు. తమకే టిక్కెట్ కేటాయించాలని చిరంజీవి వర్గం, గల్లా అరుణ కుమారి వర్గం కార్యకర్తలు పట్టుబడుతున్నారు. మరికొందరు ఆశావహులు కూడా క్యూలో ఉన్నారు.