విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుపై కోర్టుకెళ్లు: జగన్‌కు లగడపాటి, టిడిపికీ కౌంటర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి కృష్ణా జిల్లా విజయవాడ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత లగడపాటి రాజగోపాల్ సూచన చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హయాంలో భూకేటాయింపులలో అక్రమాలు జరిగాయని ఆధారాలు ఉంటే ఆయన కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు.

జగన్‌తో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నేతలు, టిడిపితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఆరోపిస్తున్నారని అధికార కాంగ్రెసు పార్టీకి ఎవరితోనూ కుమ్మక్కు అయ్యే పరిస్థితి లేదన్నారు. తన పేరును ఛార్జీషీటులో ఎ-1 నిందితుడిగా ఎందుకు పెట్టారని జగన్ ప్రశ్నిస్తున్నారని, జగన్ పేరును ఎ-1గా పెట్టి కూడా ఎందుకు అరెస్టు చేయలేదని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోందన్నారు. టిడిపికి ఏమైనా అనుమానాలు ఉంటే హైకోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు.

వారు మమ్మల్ని అడిగితే మేం ఏం సమాధానం చెబుతామన్నారు. అది కోర్టు, సిబిఐ పరిధిలోని అంశమన్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసినా చేయకపోయినా అందులో కాంగ్రెసు పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. వీరితో కుమ్మక్కయ్యారని వారు, వారితో కుమ్మక్కయ్యారని వీరంటున్నారని వీటిపై మేమేం సమాధానం చెప్పమన్నారు. లగడపాటి రాజగోపాల్ తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి మీడియాతో మాట్లాడారు.

కాగా శనివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) జగన్ ఆస్తుల కేసులో శనివారం ఛార్జీషీటు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇటు వైయస్సార్ కాంగ్రెసు, అటు తెలుగుదేశం పార్టీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. జగన్‌ను ఎ-1 నిందితుడిగా పేర్కొని ఎందుకు అరెస్టు చేయలేదని టిడిపి, తనను నిందితుడిగా ఎందుకు చేర్చారని జగన్ ప్రశ్నించారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal suggested YSR Congress Party chief YS Jaganmohan Reddy that to go court if any clues in TDP chief Nara Chandrababu Naidu land allocations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X