లాడెన్ భార్యలకు, కూతుళ్లకు పాక్‌లో నిర్బంధం

వారి పంపించేయాలని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు. లాడెన్ భార్యలు ఉంటున్న నివాసం వెలుపల ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దాన్నే అధికారులు సబ్ జైలుగా ప్రకటించారు. అదంతా రెండు వారాల్లో పుర్తవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
లాడెన్ భార్యలకు నిర్బంధం విధించిన విషయాన్ని లాడెన్ చిన్న భార్య యెమనీ సోదరుడు ధ్రువీకరించాడు. పదేసి వేల రూపాయల జరిమానా విధించినట్లు కూడా తెలిపాడు. సాధ్యమైనంత త్వరలో వారిని వారివారి స్వస్థలాలకు పంపించేయడానికి అవసరమైన పత్రాలను సిద్ధం చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దానివల్ల వారు సాధ్యమైనంత త్వరగా వారి వారి స్వస్థలాలకు చేరుకుంటారని కోర్టు అభిప్రాయడినట్లు తెలిపారు.
లాడెన్‌ను అమెరికా దళాలు పాకిస్తాన్‌లోని అబోత్తాబాద్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన భార్యలు పాకిస్తాన్‌లోనే ఉంటున్నారు. కోర్టు నిర్బంధం విధించిన 45 రోజులలోగా లాడెన్ భార్యను, కూతుళ్లను వారి వారి స్వస్థలాలకు పంపించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications