సూసైడ్‌ల బాధ్యత నేతలదే, సిఎం తీరు మారాలి: పొన్నం

ఆత్మహత్యలను ప్రోత్సహిస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం అవసరమైతే రాజీనామాకు కూడా తాను వెనకాడే ప్రసక్తి లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం ఖాయమని, విజయోత్సవాలు కూడా జరుపుకుంటామని అన్నారు. చిదంబరం అఖిల పక్షానికి అన్ని పార్టీలను త్వరగా పిలవాలన్నారు. ఎవరినో లక్ష్యంగా చేసుకొని ఎసిబి దాడులు సరికాదన్నారు.
అలా చేస్తే పార్టీకే నష్టమన్నారు. అలా చేసే వారికి ఎదురు దెబ్బ తప్పదన్నారు. తెలంగాణ కోసం ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి మారాలన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు ప్రజాప్రతినిధులు అందరూ బాధ్యత వహించాలన్నారు.
తెలంగాణ కోసం చచ్చి సాధించేదేమీ లేదని రాజయ్య అన్నారు. తెలంగాణపై అభిప్రాయం చెప్పని పార్టీలకు చిదంబరం గడువు విధించాలన్నారు. గడువులోగా వారు సమాధానం చెప్పకుంటే గతంలో చెప్పిన అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఒక్కో పార్టీ నుండి ఒక్కరినే పిలిచి అడగాలన్నారు. పార్టీలు పెట్టడం వల్ల వ్యక్తులకే లాభం అన్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం ఇప్పుడిప్పుడే తమ మాట వింటున్నట్లుగా కనిపిస్తోందన్నారు. తెలంగాణ ఇస్తుందని తాము భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణపై కేంద్రం వెంటనే తేల్చాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications