జగన్‌ను భయపెట్టాలనే: రామజోగయ్య, చిరుపై సెటైర్

చిరంజీవి సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతానని ఓట్లు వేయండని అన్నప్పుడే ప్రజలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. ఆయన మాటకు ప్రజలు విలువ ఇస్తారని తాను అనుకోవడం లేదన్నారు. చిరంజీవి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తారనే నమ్మకం ప్రజలకు పోయిందన్నారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారన్నారు. అలా డిప్యూటీ సీఎంగా ఉంటే రాష్ట్రాన్ని ఉద్దరిస్తాడని అనుకోవచ్చునని, కానీ ఇప్పుడు ఆయన పరిస్థితే బాగాలేదన్నారు.
అంతకుముందు కూడా ఆయన విలేకరులతో మాట్లాడారు. పదవుల కోసం కుమ్ములాడుకునే పార్టీ కాంగ్రెసు పార్టీ అని ధ్వజమెత్తారు. సిబిఐ ఛార్జీషీటులో జగన్ పేరును ఎ-1గా చేర్చి ఆయనను భయపెట్టాలని చూసిందన్నారు. జగన్‌కు, వైయస్సార్ కాంగ్రెసుకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందన్నారు.
ఒకవేళ జగన్ అరెస్టయినా పులివెందుల శాసనసభ్యురాలు, పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్రజల్లోకి వస్తారని చెప్పారు. ఆమె ముందుండి పార్టీని నడిపిస్తారని అన్నారు. 2014 సాధారణ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుపు తథ్యమన్నారు.












Click it and Unblock the Notifications