తెలంగాణ ఆత్మహత్యలపై ఎంపి, నటి జయప్రద ఆవేదన

Jayaprada
తిరుపతి: తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న ఆత్మహత్యలపై ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాంపూర్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యురాలు, నటి జయప్రద మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె సోమవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. కాలి నడకన ఆమె రాత్రి కొండ పైకి వెళ్లారు. మంగళవారం ఉదయం ఓ టీవి ఛానల్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలపై ఆమె ఆందోళన చెందారు. తెలంగాణ కోసం పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆమె అన్నారు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పారు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రస్తుతం పలు సమస్యలు ఎదుర్కొంటుందని ఆమె అన్నారు. తెలంగాణ, చేనేత వంటి సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. తాను ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను చూస్తూ కూడా ఏమీ చేయలేక పోతున్నానే అనే బాధ కలుగుతోందని అన్నారు. తాను ప్రస్తుతం రాంపూర్ నియోజకవర్గానికి ఎంపిగా ఉన్నానని, ఈ రెండేళ్లు అక్కడి ప్రజలకు సేవ చేయాల్సి ఉందని చెప్పారు.

భవిష్యత్తులో ఒకవేళ రాష్ట్రానికి వస్తే తాను సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు న్యాయం చేస్తానని చెప్పారు. తాను ఎక్కడున్నా తెలుగు బిడ్డనే అన్నారు. ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తెలుగువారిని మరిచి పోనని అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం తెలుగు వారే అన్నారు. తాను ఎక్కడున్నా తన గెలుపును ఇక్కడి ప్రజలు కోరుకుంటారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ తనకు పుట్టినిల్లు అయితే ఉత్తర ప్రదేశ్ మెట్టినిల్లు అన్నారు. అయితే ఏ ఆడబిడ్డకు అయినా పుట్టినిల్లు అంటేనే కాస్త ఎక్కువ ఆప్యాయత ఉంటుందని చెప్పారు. తాను ఏదైనా రాజకీయా పార్టీలో చేరాలనుకుంటే జాతీయ పార్టీకే ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+