ఆటో డ్రైవర్లను చితకబాదిన తృణమూల్‌కాంగ్రెస్ ఎమ్మెల్యే

వివరాల ప్రకారం.. పుల్‌బాగన్ నియోజకవర్గానికి చెందిన టిఎంసి ఎమ్మెల్యే పరేష్ పాల్ మంగళవారం పెరిగిన ఇంధన ఛార్జీలు నిరసిస్తూ ఆందోళన చేస్తున్న పలువురు ఆటో డ్రైవర్లను చితకబాదారు. ఇంధన ఛార్జీలను పెంపును నిరసిస్తూ ఆటో డ్రైవర్లు మంగళవారం ఉదయం కోల్‌కతాలోని పలుచోట్ల రోడ్లు బ్లాక్ చేసి నిరసన తెలిపారు. వీరు ట్రాఫిక్ బాగా ఉండే సమయంలో రోడ్ల పైన ధర్నాకు దిగారు.
కంకుర్గచి, పుల్‌బాగన్, ఉత్తర కోల్‌కతాలోని హుడ్కో క్రాస్, దక్షిణ పట్టణంలోను ప్రధాన కూడలి రాష్‌బెహరీ తదితర ప్రాంతాలలో ఆటో డ్రైవర్లు రోడ్లను బ్లాక్ చేశారు. ఆందోళనకారులు రాళ్లు తీసుకొని బస్సుల పైకి విసిరారు. ప్రయాణీకులను, విద్యార్థులను, ముసలి వాళ్లను దింపి వేశారు. దీనిని చూసిన పుల్‌బాగన్ ఎమ్మెల్యే పరేష్ పాల్ రోడ్లను బ్లాక్ చేయవద్దని డ్రైవర్లను అడిగారు. ఆయన విజ్ఞప్తిని వారు తోసిపుచ్చారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారిని చితకబాదారు. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ విషయంలో ఎలాంటి అరెస్టులు జరగలేదు. కాగా ఆందోళనకారులు రహదారులను ఉదయం పదిగంటల ప్రాంతంలో బ్లాక్ చేశారు. ఆ తర్వాత కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఇంధన పెంపును నిరసిస్తూ ఆటో డ్రైవర్లు రాజధానిలోని ఎనిమిది ప్రధాన ప్రాంతాల్లో రోడ్లను బ్లాక్ చేశారు.












Click it and Unblock the Notifications