హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోనియా పిలవడం ఊహ: జాతీయ ఛానల్‌తో జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: తాను కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాతే వేధింపులు ప్రారంభమయ్యాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం రాత్రి జాతీయ ఛానల్ ఎన్డీటివికి ఇచ్చిన ముఖాముఖిలో పేర్కొన్నారు. ఆ ఛానల్ విలేకరి పలు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పారు. తన గురించి కాంగ్రెసు పార్టీ ఏమాలోచిస్తుందో తనకు తెలియదని తాను మాత్రం ఆ పార్టీతో వెళ్లే ప్రసక్తి లేదని చెప్పారు. కాంగ్రెసుతో తమ రాజకీయ పోరాటం జరుగుతోందని ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనను పిలనవడం నేను కాంగ్రెసులోకి వెళ్లడం అనేది ఊహాజనిత ప్రశ్న అన్నారు. తాను విశ్వసనీయతకు, వ్యక్తిత్వానికి విలువనిచ్చే వ్యక్తినని చెప్పారు.

తాను కాంగ్రెసును వీడాక నెల రోజుల తర్వాత మాజీ మంత్రి శంకర రావుతో హైకోర్టుకు వెళ్లారన్నారు. అందులో తెలుగుదేశం పార్టీ వారు కూడా భాగస్వాములయ్యారన్నారు. సోనియా చెబితేనే తాను జగన్ పైన హైకోర్టుకు లేఖ రాసినట్లు శంకర రావే స్వయంగా చెప్పారన్నారు. నేను కాంగ్రెసులో ఉన్నప్పుడు కానీ, తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కానీ తనపై ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదన్నారు. తన తండ్రి మృతిని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను ఓదారుస్తానని తాను నల్లకాల్వ వద్ద మాట ఇచ్చానని చెప్పారు. తన మాట అధిష్టానానికి రుచించలేదన్నారు. గత్యంతరం లేకే తాను పార్టీని వీడినట్లు చెప్పారు.

వైయస్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదని చెప్పారు. ఆయన ప్రజ సంక్షేమం కోసమే పాటుపడ్డారని అన్నారు. ఇతరుల పైన విమర్శలు చేసేటప్పుడు ఆలోచించాలన్నారు. వైయస్ నిబంధనలకు విరుద్ధంగా చేస్తే నిరూపించాల్సిన అవసరముందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో ఏం చేశారో, నా తండ్రి ఏం చేశారో పోల్చండని చెప్పారు. బాబు చేసింది న్యాయమైనప్పుడు అదే విధానాలతో ముందుకెళ్లిన వైయస్ చేసినవి అక్రమాలు ఎలా అవుతాయన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవే విధానాలు అవలంభిస్తున్నారన్నారు. వెనుకబడిన మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉద్యోగాల కల్పన కోసం మొదటి పది స్థానాల్లో ఉన్న ఫార్మా కంపెనిలకు భూములు లీజుకిచ్చారన్నారు. అందులో ఎలాంటి అక్రమాలు లేవన్నారు.

ఈనాడు పత్రికి ఏటా రూ.1,800 కోట్ల నష్టంలో ఉందని, అలా ఉండి కూడా ఆ సంస్థ విలువను రూ.6,800 కోట్లుగా చూపి షేర్లను అమ్ముకుందని, నష్టాల్లో ఉన్న ఆ పత్రికలోకి రూ.2,600 కోట్ల పెట్టుబడులు వస్తే ఒప్పెలా అవుతుందన్నారు. సాక్షి సర్య్కులేషన్ పరంగా దేశంలో ఎనిమిదో స్థానంలో ఉందన్నారు. పెట్టుబడులు తప్పుడివే అయితే సిబిఐ నా ఇళ్లపై, ఆస్తులపై దాడులు జరిపినప్పుడు ఆ షేర్ల సర్టిఫికేట్లు దొరిగాయా అని ప్రశ్నించారు. తమ సంస్థల్లోని పెట్టుబడులు అన్నీ న్యాయబద్దమైనవే అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటే మంత్రిని అయ్యేవాడినని, అప్పుడు ఈ వివాదాలు వచ్చి ఉండేవి కాదు కదా అన్నారు. జివోలపై విచారణ జరపకుండానే సిబిఐ ఛార్జీషీట్ దాఖు చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.

English summary
YSR Congress Party chief, Kadapa MP YS Jaganmohan Reddy said that Congress party has intiated CBI probe against him, as he left the party.He said that he will not rejoin in Congress.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X