వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను ఎదుర్కోవడమెలా?: బొత్స, కిరణ్‌తో ఆజాద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy - Botsa Satyanarayana - Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మధ్య విభేదాలు కొలిక్కి వచ్చినప్పటికీ దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర రాజకీయ వేడి మాత్రం తగ్గలేదు. పార్టీ పెద్దలతో బొత్స, కిరణ్, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం రాత్రి మూడున్నర గంటల పాటు సమావేశమైన విషయం తెలిసిందే. గురువారం ఉదయం కూడా పార్టీ పెద్దలు వీరితో చర్చలు జరిపారు.

కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఉదయం బొత్స, కిరణ్, దామోదరలకు అల్పాహార విందు ఇచ్చారు. ఆ తర్వాత వారితో భేటీ అయ్యారు. రానున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గం ఉప ఎన్నికలపై ఆజాద్ వారితో కసరత్తు చేశారని తెలుస్తోంది. ఉప ఎన్నికలపై వారి మధ్య వాడి వేడి చర్చ జరిగినట్లుగా సమాచారం. సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే అంశంపై వారితో ఆజాద్ వ్యూహరచన చేశారట.

అలాగే తెలంగాణ అంశం పైన వారి అభిప్రాయాలను ఆజాద్ తెలుసుకున్నారు. వీరు దాదాపు గంటపాటు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్ మధ్యాహ్నం 12.10 నిమిషాలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం బొత్స, కిరణ్, దామోదర ఢిల్లీ వెళ్లడానికి ముందే వారి మధ్య విభేదాలు సమసిపోయినట్లుగా తెలుస్తోంది.

హైదరాబాదు నుండి వేరువేరుగా ఢిల్లీ వెళ్లిన బొత్స, కిరణ్ బుధవారం రాత్రి అధిష్టానంతో భేటీ అనంతరం ఒకే కారులో ఎపి భవన్‌కు వచ్చారు. కాగా ఎపి భవనంలో బాబూ జగ్జీవన్ రామ్ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కిరణ్, బొత్స, దామోదర ఆయనకు నివాళులు అర్పించారు. మరోవైపు శాసనమండలి సభ్యుడు డి శ్రీనివాస్ ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.

English summary
Congress Andhra Pradesh affairs incharge Ghulam Nabi Azad chalked out a strategy for bypolls with CM Kiran Kumar Reddy and PCC chief Botsa Satyanarayana to face YSR Congress Party chief YS Jaganmohan Reddy. He discussed with both the leaders on bypoll strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X