విచారణ ఆపే యత్నం: జగన్‌పై బొత్స, డబ్బు కక్కుర్తితో

ఆయన పాయకరావుపేటలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. డబ్బులకు కక్కుర్తిపడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతలు తమ శాసనసభ్యత్వాలకు రాజీనామాలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు గెలుపుకు కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కాంగ్రెసు పార్టీ రైతుల రుణం తీర్చుకుంటుందన్నారు. వ్యవసాయం దండుగ అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు కల్లిబొల్లి మాటలు నమ్మొద్దన్నారు. ఆయన హయాంలో రైతులు ఎన్ని కష్టాలు పడ్డారో అందరికీ తెలుసునన్నారు. ఆయన ద్వారా రైతులకు ఎప్పటికీ న్యాయం జరగదన్నారు. బాబు స్టే తెచ్చుకోకుంటే ఇప్పటికి జైలులో కూర్చునే వారన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచనున్నట్లు చెప్పారు. సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడంలో ఎలాంటి రాజీ లేదన్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెసు పార్టీ విజయానికి కృషి చేస్తామని కార్యకర్తలతో బొత్స ప్రతిజ్ఞచేయించారు.
పింఛన్లు రావడం లేదని, ఫీజు రీయింబర్సుమెంట్లు రావడం లేదని జగన్ అంటున్నారని, ఎవరికైనా రాలేదని నిరూపిస్తే తాను తలదించుకొని వెళతానని సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ద్వారా సిబిఐ విచారణ ఆపాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కాగా బొత్స శంఖం పూరించి కార్యకర్తలను ఉత్సాహపరిచారు.












Click it and Unblock the Notifications