వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ, గర్భిణీ మృతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Swine Flu
విశాఖపట్నం: మన్యంలో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. విశాఖపట్నం జిల్లాలో స్వైన్ ఫ్లూ కారణంగా ఓ గర్భిణీ సోమవారం మృతి చెందింది. విశాఖలోని చాతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఈమె పాతగాజువాకకు చెందిన మహిళ. జిల్లాలో మరో నలుగురికి స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి వయస్సు 23 సంవత్సరాలు.

స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా ప్రవేశిస్తుంది. దీంతో వైజాగ్ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. వైజాగ్‌లో స్వైన్ ఫ్లూ కారణంగానే గర్భిణీ మృతి చెందిందనే వార్త మన్యంలో ఆందోళనకు గురి చేసింది. వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఇటీవలే కొద్ది రోజుల క్రితం మొదటి స్వైన్ ఫ్లూ కేసు నగరంలో నమోదయింది. సంవత్సరం అనంతరం ఇది మరోసారి వెలుగు చూసింది. మర్రిపాలెంకు చెందిన ముప్పయ్యేళ్ల ఓ మహిళ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఇటీవల జ్వరం, శ్వాస సంబంధ బాధతో జాయిన్ అయింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు కనుగొన్నారు.

కాగా హెచ్1ఎన్1 వైరస్ అనూహ్యంగా మార్చి చివరి వారంలో ఉత్తేజమై వాతావరణ మార్పుల కారణంగా ఏప్రిల్‌లో పూర్తిగా వ్యాపించింది. ఈ పరిస్థితులను జిల్లా నోడల్ అధికారి పర్యవేక్షిస్తున్నారు. మృతి చెందిన గర్భిణీ మొదట ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జాయిన్ అయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు హెచ్1ఎన్1గా అనుమానించారు. పరీక్షల నిమిత్తం పాథాలజీ శాంపిల్‌ను ముంబయికి పంపించారు. స్వైన్ ఫ్లూ అయినట్లు నిర్ధారణ అయింది.

English summary
Is Swine Flu spreading in the port city? One more positive swine flu case was registered here on Sunday. A 23-year-old pregnant woman and resident of Gajuwaka area had been battling flu symptoms for the past few days. Her condition is said to be critical. A few days back the first swine flu case was registered in the city after a gap of one year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X