కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్ననంటే కాంగ్రెస్‌కు వ్యతిరేకం: వైయస్ వివేకా ఝలక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కడప: త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో తన సోదరుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని కాంగ్రెసు పార్టీ విమర్శిస్తే తాను కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం చెప్పారు. ఆయనను కడప జిల్లాలో మీడియా ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైయస్‌ను విమర్శిస్తే తాను కాంగ్రెసు పార్టీని విమర్శించేందుకు సిద్ధమన్నారు.

ఆయన ఉన్నప్పుడు వైయస్‌ను రోల్ మోడల్ అన్న వారు ఇప్పుడు విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తి లేదని అయితే వైయస్‌ను అంటే మాత్రం ఊరుకోనని స్పష్టం చేశారు. అప్పుడు వైయస్‌ను కీర్తించిన వారు ఇప్పుడు దోషి అనడం దుర్మార్గమన్నారు.

తాను వైయస్సార్‌ను విమర్శించి ఆత్మద్రోహం చేసుకోలేనని చెప్పారు. ఇది స్థానిక నేతల కుట్ర కావొచ్చునని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. త్వరలో ఈ కుట్రను బయటపెడతానని చెప్పారు. వైయస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి వస్తే పూర్తిగా వ్యతిరేకిస్తానని చెప్పారు. పులివెందులలో ప్రజా సమస్యలపై పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాగా వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డి తన సోదరుడి తనయుడు కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసును వీడి సొంత కుంపటి పెట్టుకున్నప్పటికీ ఆయన పార్టీని వీడలేదు. తాను పార్టీ వీడేది లేదని ఆయన పలుమార్లు స్పష్టం చేశారు. తాజాగా కాంగ్రెసులో వైయస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలోనూ పార్టీ వీడనని, అయితే తన అన్నను అంటే మాత్రం ఊరుకోనని చెప్పడం గమనార్హం.

English summary
Former Minister YS Vivekananda Reddy opposed Congress strategy on late YS Rajasekhar Reddy. He said he is ready to campaign against Congress if they make allegations on late YSR. He continued that he is ready fight to solve Pulivendula peoples problems.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X