హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అలీఖాన్‌ను నిందితుడిగా ఎందుకు చేర్చారు?: కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ali Khan
హైదరాబాద్: ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్‌ను ఏ ఆధారాలతో నిందితుడిగా చేర్చారో చెప్పాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. అసోసియేటెడ్ మైనింగ్ కంపెనీ (ఎఎంసి) కేసులో నిందితుడిగా అలీఖాన్ కర్ణాటక రాజధాని బెంగళూర్ జైల్లో ఉన్నాడు. అతన్ని హైదరాబాదు తరలించేందుకు పిటి వారంట్ జారీ చేయాలని సిబిఐ కోర్టును కోరింది.

ఒఎంసి కేసులో అలీఖాన్‌ను నిందితుడిగా చేర్చడంపై ఆయన తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ నిబంధన కింద అలీఖాన్‌ను నిందితుడిగా చేర్చారో చెప్పాలని ప్రశ్నించారు. దీంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోర్టు సిబిఐని ఆదేశించింది. ఏ ఆధారాలు, చట్టంలోని ఏ వెసులుబాటు ప్రకారం నిందితుడిగా చేర్చామో రేపు చెబుతామని సిబిఐ తరఫు న్యాయవాది చెప్పారు. దీంతో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

సిబిఐ స్వాధీనం చేసుకున్న వాహనాలను తమకు తిరిగి అప్పగించాలని గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సిబిఐ కోర్టు ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది. సోదాల సమయంలో సిబిఐ గాలి జనార్దన్ రెడ్డికి చెందిన హెలికాప్టర్‌ను, అధునాతమైన కార్లను స్వాధీనం చేసుకుంది. వాడకుండా వదిలేస్తే అవి పాడుతాయని, వాటిని తిరిగి తమకు అప్పగించాలని, అవసరమైనప్పుడు వాటిని ప్రవేశపెడతామని గాలి జనార్దన్ రెడ్డి చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు.

గాలి జనార్దన్ రెడ్డిని, శ్రీనివాస రెడ్డిని ఒఎంసి కేసులో హైదరాబాద్ సిబిఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత గాలి జనార్దన్ రెడ్డిని ఎఎంసి కేసులో బెంగళూర్ తరలించారు. ఆయనను బెంగళూర్ కోర్టులో ప్రవేశపెట్టిన రోజే అనూహ్యంగా గాలి జనార్దన్ రెడ్డి పిఎ అలీఖాన్ కోర్టులో లొంగిపోయాడు. అప్పటి వరకు సిబిఐ అధికారులు అలీఖాన్ కోసం గాలిస్తూనే ఉన్నారు. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన పలు విషయాలు అలీఖాన్ వద్ద ఉందని సిబిఐ అధికారులు అనుమానిస్తూ వచ్చారు.

English summary
Nampally special court has asked CBI to clarify how Alikhan will be named as accused without proofs in Karnataka former minister Gali Janardhan Reddy's OMC illegal mining case. Hearing is adjourned for tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X