కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపి పొన్నం ప్రభాకర్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Ponnam Prabhakar
కరీంనగర్/ హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మరోసారి మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తనకు నచ్చినవారిని అందలమెక్కిస్తున్నారని, నచ్చనివారిని తొలగిస్తున్నారని ఆయన గురువారం కరీంనగర్‌లో మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న డిజిపి దినేష్ రెడ్డిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వయంగా హైకోర్టే దినేష్ రెడ్డిని తప్పు పట్టిందని ఆయన గుర్తు చేశారు.విచారణకు ఆదేశించిన తర్వాత పదవిలో ఉంటే ప్రభుత్వం విశ్వాసం కోల్పోతుందని ఆయన అన్నారు. ఎసిబి డిజి రాజకీయ నాయకుడి మాదిరిగా మాట్లాడుతున్నారని ఆయన అననారు. తెల్ల రేషన్ కార్డులున్నవారు మద్యం దుకాణం పెట్టుకుంటే తప్పేమిటని ఆయన అడిగారు. రాష్ట్ర జనాభాలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులున్నాయని ఆయన చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు అంత మందికి ఎలా వచ్చాయో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

రూ. 50 కోట్ల కన్నా ఎక్కువ పెట్టుబడి పెట్టిన కంపెనీలన్నింటిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తెల్లరేషన్ కార్డులున్నవారికి కూడా మద్యం దుకాణాలున్నాయని ఇటీవల వార్తలు వచ్చాయి. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఉండాలి. కానీ సంపన్నుల చేతిలో కూడా తెల్లరేషన్ కార్డులున్నాయనే అర్థంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని తేల్చకపోవడం వల్లనే తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో తమ కాంగ్రెసు పార్టీ ఓడిపోయిందని శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం అధిష్టానంపై ఒత్తిడి పెంచేందుకు తెలంగాణ ప్రాంత మంత్రులే చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరును వాడుకోవాలా, వద్దా అనే చర్చ కూడా అనవసరమని ఆయన అన్నారు. వైయస్ హయాంలో అవినీతి జరిగిందా, లేదా అనే విషయాన్ని సిబిఐ విచారణ జరుగుతోందని ఆయన అన్నారు. ఆధారాలతో సహా సిబిఐ తేల్చేంత వరకు ఎవరినీ అవినీతిపరులని అనలేమని ఆయన అన్నారు.

English summary
Congress Telangana region MP Ponnam Prabhakar fired at CM Kiran kumar Reddy. He demanded remove DGP Dinesh Reddy, as court ordered enquiry on him. He alleged that ACB DG is speaking like politician.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X