తెలంగాణలో ఉంటుందో లేదో:హైదరాబాద్‌పై దానం వ్యాఖ్య

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతోనే తాను తెలంగాణకు అనుకూలంగా గతంలో సంతకం చేశానని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంటుందో లేదో ఇంకా తెలియదన్నారు. దీనిపై ఇంకా ఏం నిర్ణయం కాలేదని చెప్పారు.
తనను ఢిల్లీ రావాలని తెలంగాణ ప్రాంత నేతలు ఎవరూ కోరలేదని ఆయన చెప్పారు. ఢిల్లీ వెళ్లడం లేదని చెప్పారు. త్వరలో జరగనున్న ఉప ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రచారానికి వెళతానన్నారు. ఈ ఉప ఎన్నికలలో అభివృద్ధే మా నినాదం అని చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డిని దళిత ద్రోహిగా చిత్రీకరించడం విచారకరమని అన్నారు. వైయస్ వేరు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వేరు అని ఆయన చెప్పారు. ఇద్దరిని వేర్వేరుగా చూడాల్సి ఉంటుందన్నారు. ఆయనతో జగన్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న కళాశాలలపై చర్యలు తీసుకోవాలని తాను ముఖ్యమంత్రిని కోరానని చెప్పారు.












Click it and Unblock the Notifications