పహారాలోనే పాతబస్తీ, 5గంటల వరకు కర్ఫ్యూ సడలింపు

మాదన్నపేట, సైదాబాదుతో పాటు మొఘల్‌పురా, బహదూర్‌పురా, చార్మినార్ తదితర ప్రాంతాలలోనూ పోలీసులను భారీగా మోహరించారు. హోంగార్డులను కూడా రంగంలోకి దింపారు. కాగా మత ఘర్షణలు చెలరేగిన హైదరాబాద్ పాతబస్తీలో అదివారం నుండి పూట కర్ఫ్యూను విధించిన విషయం తెలిసిందే. మరోవైపు గురువారం సాయంత్రం ఐదు గంటల నుంచి సైదాబాద్, మాదన్నపేట ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలులోకి వచ్చింది. రోడ్లపై ఉన్న ప్రజలను పోలీసులు ఇళ్లకు పంపించి వేశారు.
మొత్తం మీద పాతబస్తీలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంది. బుధవారం నుండి పోలీసులు కర్ఫ్యూ సడలింపు ఇవ్వడంతో మూడు రోజుల పాటు ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఒక్కసారిగా రోడ్ల మీదికి వచ్చారు. నిత్యావసర సరుకులు కొనుక్కోవడానికి వారు ఎగబడ్డారు. కర్ప్యూ ఎత్తివేసిన సమయంలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటన కూడా చోటు చేసుకోలేదు. దీంతో పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications