విచారణలో తేలుతుంది: ఐఏఎస్ శ్రీలక్ష్మికి సబిత కౌంటర్!

తనపై చేసిన ఆరోపణలలోని నిజా నిజాలు సిబిఐ దర్యాఫ్తులో తేలుతాయని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న ఆరుగురు మంత్రులం న్యాయవాదులను నియమించుకునే పనిలో ఉన్నామని ఆమె తెలిపారు.
కోర్టులో, సిబిఐ విచారణలో అన్నీ వెలుగులోకి వస్తాయని చెప్పారు. మంత్రులపై వచ్చిన ఆరోపణల్లో కూడా కోర్టులోనే తేల్చుకుంటామని ఆమె చెప్పారు. ఉమేష్ కుమార్, డిజిపి దినేష్ రెడ్డిల వ్యవహారంపై కోర్టు ఆదేశాలకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
కాగా ఓఎంసి కేసులో తనకు ఏమాత్రం సంబంధం లేదని, ఇందుకు సంబంధించిన జీవోలన్నీ అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆమోదంతోనే జారీ అయ్యాయని ఓఎంసి కేసులో నిందితురాలు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి అంతకుముందు పేర్కొన్న విషయం తెలిసిందే. తనకు సంబంధం లేదని సబితా చెప్పిన దాంట్లో నిజం లేదని శ్రీలక్ష్మి చెప్పింది.
ఓఎంసీకి ముడి ఇనుప గనుల లీజుల కోసం జారీ అయిన జీవోలు, గనుల శాఖ జారీ చేసిన జీవోలు అప్పటి ఆ శాఖ మంత్రి ఆమోదంతోనే వెలువడ్డాయని చెప్పారు. వీటి ప్రతిపాదనలన్నీ డైరెక్టరేట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చాయని, అలా వచ్చిన ప్రతిపాదనలను మంత్రి పేషీకి నాడు తాను పంపించానని, మంత్రి ఆమోదంతోనే ఆ జీవోలన్నీ విడుదలయ్యాయని, కాబట్టి, ఓఎంసి అక్రమాలతో నాకు ఏ సంబంధం లేదని శ్రీలక్ష్మి చెప్పారు.












Click it and Unblock the Notifications