ఎస్పీ శ్యాంసుందర్‌పై నన్నపనేని రాజకుమారి ఫైర్

ఇదిలావుంటే, కార్తిక్ తరఫు న్యాయవాది సంజీవ రెడ్డిపై గోపిప్రియ తండ్రి నాగమల్లేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీతో తప్పుడు సంబంధం ఉందంటూ ప్రచారం చేసి గోపిప్రియ పరువుకు నష్టం కలిగించారని ఆరోపించారు. తమ అనుమతి లేకుండా తమ ఫోన్ కాల్ లిస్టును విడుదల చేయడంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డిఎస్పీని కలిసి నాగమల్లేశ్వర్ రాతపూర్వకమైన ఫిర్యాదును అందించారు.
కాగా, తాను బాధితురాలికి న్యాయం చేయడానికి మాత్రమే ప్రయత్నించానని ఎస్పీ శ్యాంసుందర్ స్పష్టం చేశారు. ఈ కేసులో తాను ఏ విధమైన తప్పు చేయలేదని ఆయన చెప్పారు. తాను గోపీప్రియ తండ్రితో మాత్రమే ఫోన్‌లో మాట్లాడానని ఆయన చెప్పారు. కార్తిక్ తండ్రి సిఐకి 15 లక్షల రూపాయల లంచం ఇవ్వజూపారని, కేసును తారుమారు చేయాలని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారని, అందుకే తాను గోపిప్రియ వరకట్నం వేధింపుల కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టానని ఆయన చెప్పారు.
కార్తిక్ ఆరోపణలను గోపిప్రియ కూడా ఖండిస్తోంది. తనకు ఎస్పీతో ఏ విధమైన సంబంధం లేదని ఆమె చెప్పారు. తన తండ్రితో కలిసి మొదటిసారి తాను శ్యాంసుందర్‌ను కలిసినట్లు ఆమె తెలిపారు. తన ఫోన్‌ను తన తండ్రి వాడుతున్నారని, ఎస్పీతో ఫోన్‌లో తన తండ్రి మాత్రమే మాట్లాడారని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications