కాక్రోచ్ జనతా పార్టీకి భారీ విజయం.. ఎట్టకేలకు హైకోర్టు ఆదేశాలతో..

కాక్రోచ్ జనతా పార్టీ(CJP)కు బిగ్ రిలీఫ్ లభించింది. సీజేపీ ఎక్స్ ఖాతాను అన్ బ్లాక్ చేయాలని దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున విచారణకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఎక్స్ ఖాతాను అన్ బ్లాక్ చేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. నీట్ పరీక్ష నేపథ్యంలో సీజేపీ ఎక్స్ మాధ్యమం ఖాతాను బ్లాక్ చేశామని ఈ పరీక్షకు లక్షల మంది విద్యార్థులు హాజరవుతున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఖాతా నుంచి వస్తున్న అనేక పోస్టులు, మెసేజ్ లతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం అయిందని అందుకే సీజేపీ ఎక్స్ అకౌంట్ ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసిందని తెలిపారు. ఇప్పుడు పరీక్ష పూర్తయిందని ట్విట్టర్ అకౌంట్ ను అన్ బ్లాక్ చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. తాజాగా దిల్లీ హైకోర్టు ఆదేశాలతో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దిప్కే కు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయింది.

మరోవైపు దేశ రాజధాని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన భారీ నిరసనలు 18వ రోజుకు చేరుకున్నాయి. జూన్ 20న ఆందోళనలు ప్రారంభం అయ్యాయి. 18 రోజులుగా నిరవధికంగా కొసాగుతూనే ఉన్నాయి. నీట్ యూజీ 2026 పరీక్షలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ లకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే స్పష్టం చేశారు.

CJP Receives Relief Delhi HC Orders Unblocking of Cockroach Janata Party Account CJP X account

ఇక ఇదే విషయంపై జంతర్ మంతర్ వద్ద ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 10 రోజులుగా సోనమ్ వాంగ్ చుక్ నిరాహార దీక్ష సాగుతోంది. ఆయన ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది. తాజా మెడికల్ సమాచారం ప్రకారం ఆయన 7.3 కిలోల బరువు తగ్గారు. సోనమ్ వాంగ్ చుక్ బీపీ 102/61 mmHg గా ఉంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు 68 mg/dL కు చేరాయి. దాంతో ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆమరణ నిరహార దీక్ష కొనసాగుతూనే ఉంటుందని సోనమ్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+