భూమి నుంచి విషవాయువు లీక్: ముగ్గురికి అస్వస్థత

భూమి నుంచి పగిలి గొట్టం ద్వారా బూడిదతో పాటు పొగ ఉబికి వచ్చింది. ఏదైనా వస్తువు పడితే భగ్గున మండిపోతోంది. అయితే, దీనివల్ల ఏ విధమైన ప్రమాదం లేదని జియాలిజిస్టులు చెబుతున్నారు. చుట్టుపక్కల చెట్లు మాడి మసైపోయాయి. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పగిలిన గొట్టంలోంచి విషవాయువు వెలువడడం ప్రారంభమైంది.
ఏడాదిన్నర క్రితం కూడా ఇక్కడ ఇలాగే జరిగింది. అప్పుడు ఫైరింజన్లు వచ్చి పరిస్థితిని అదుపు చేశాయి. గ్యాస్ నిక్షేపాల వల్లనే విషవాయువు లీక్ అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవి ఏ రకమైన నిక్షేపాలనేది తెలియడం లేదు. మాడి మసై పోయిన చెట్లను, గ్యాస్ ఉబికి వస్తున్న చిత్రాలను తెలుగు టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి.
నిప్పులు కక్కుతూ బూడిదతో పాటు వాయువు ఉబికి వస్తోంది. దాన్ని ఏలా అదుపు చేయాలనే విషయం ప్రజలకు అర్థం కావడం లేదు.












Click it and Unblock the Notifications