వివాహితపై ప్రియుడి హత్యాయత్నం, అనుమానంతో

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం - పింకి అనే మహిళ కిరణ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని గత ఐదేళ్లుగా న్యూ రణిప్‌లో ఉంటోంది. పింకి తన పాత ప్రియుడితో సంబంధాలు కొనసాగిస్తోందని కిరణ్ అనుమానిస్తూ వచ్చాడు. ఇరువురి మధ్య గొడవలు పెరగడంతో కిరణ్ ఆమెను వదిలేసి రాజస్థాన్‌లోని తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.
కిరణ్ వెళ్లిపోవడంతో పప్పు తరుచుగా పింకి ఇంటికి రావడం సాగించాడు. గత పక్షం రోజులుగా పింకిని పప్పు కూడా అనుమానించడం ప్రారంభించాడు. పింకికి మరో వ్యక్తితో సంబంధం ఉందని అతను అనుమానించాడు. ఆ విషయంపై ఇరువురికి మధ్య గొడవ జరిగింది.
గొడవ జరుగుతున్న సమయంలో కోపంతో పప్పు పింకిపై కిరోసిన్ పోసి ఆమె ఒంటికి నిప్పంటించాడు. వెంటనే అతను ఇంటి నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వచ్చి పింకిని ఆస్పత్రికి చేర్చారు. యాభై శాతం గాయాలతో ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.












Click it and Unblock the Notifications