వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరకాలలో మేం పోటీ చేస్తాం: కెసిఆర్‌తో నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

KCR - Narayana
హైదరాబాద్: వచ్చే ఉప ఎన్నికల్లో పరకాల సీటును తమకు వదిలేయాలని సిపిఐ కార్యదర్శి కె. నారాయణ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కోరారు. నారాయణ గురువారం కెసిఆర్‌కు ఫోన్ చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖపై వేటు పడడంతో పరకాలకు ఉప ఎన్నిక వస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేయడానికి కొండా సురేఖ సిద్ధపడ్డారు. ఈ స్థితిలో తమకు పరకాలలో తమకు మద్దతు ఇవ్వాలని నారాయణ కెసిఆర్‌ను కోరారు. కాగా పరకాలలో తెరాసకు మద్దతివ్వాలని సిపిఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పరకాలలో తాము పోటీ చేస్తామని తెరాస ఇటీవలే ప్రకటించింది. నాయని నర్సింహా రెడ్డి నేతృత్వంలోని పార్టీ ఎన్నికల కమిటీ అభ్యర్థిని ఖరారు చేయడానికి మంతనాలు కూడా జరుపుతోంది. ఈ స్థితిలో నారాయణ కెసిఆర్‌తో మాట్లాడారు. భవిష్యత్తులో సిపిఐతో పొత్తు పెట్టుకునేది తామేనని, అందువల్ల ఈసారికి ఆ సీటును తమకు వదలాలని ఆయనతో కెసిఆర్‌ అన్నారు.

గత ఉప ఎన్నికల్లో సిపిఐ తెరాసకు మద్దతు ప్రకటించింది. పరకాలలో తెరాస లేదా సిపిఐ పనిచేయాలని, ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే బిజెపి ప్రయోజనం కలుగుతుందని, బిజెపిని కట్టడి చేయడానికి అవగాహన అవసరమని నారాయణ కెసిఆర్‌తో అన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికలో తెరాసతో పాటు బిజెపి కూడా పోటీ చేసింది. బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి చేతిలో తెరాస అభ్యర్థి ఓడిపోయారు. ఆ పరిస్థితి రాకూడదంటే సిపిఐ, తెరాస అవగాహనతో పనిచేయాలనే చర్చనువ నారాయణ ముందుకు తెచ్చినట్లు కనిపిస్తోంది.

సిపిఐ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. బిజెపి కూడా తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. అయితే, తెరాసతో విభేదాలతో ఆ పార్టీని తెలంగాణలో ఢీకొనడానికి బిజెపి సిద్ధపడింది. ఈ సమయంలోనే సిపిఐ తెరాసకు దగ్గర కావాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా, అందులో పరకాల మాత్రమే తెలంగాణలో ఉంది.

English summary
CPI secretary K Narayana has appealed to Telangana Rastra Samithi president K Chandrasekhar Rao to support his party candidate at Parakal assembly segment of Warangal district in coming bypolls.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X