జగన్ పార్టీ నుండి బెదిరింపులు, మార్పుతెస్తా: కెఏ పాల్

ఒంగోలు సభను అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుండి బెదిరింపులు వస్తున్నాయని, ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. మీటింగ్ అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు. తాము పత్తిపాడు, నర్సాపురం, పాయకరావుపేట, ఒంగోలు తదితర ఐదారు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు ప్రాథమికంగా నిర్ణయించుకున్నామని చెప్పారు.
త్వరలో సమావేశమై మిగతా స్థానాలపై పోటీ చేసే విషయంపై పార్టీలో చర్చిస్తామని కెఏ పాల్ చెప్పారు. రాజకీయాలలో మార్పు రావాలని, తేవాలని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు అన్నీ అవినీతిలో కూరుకు పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ మార్పు తీసుకు వస్తుందని ఆయన హామీ ఇచ్చారు.
కాగా అవినీతికి పాల్పడిన వారు జైలు పాలవడం ఖాయమని కెఏ పాల్ ఇటీవల అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకు పోయినట్లుగా కనిపిస్తోందన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో తమ ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.
త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టే విషయంపై పార్టీలో చర్చిస్తున్నామని అప్పుడు చెప్పారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు.
అంతకుముందు గుంటూరు జిల్లాలో పర్యటించిన కెఏ పాల్ రానున్న ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అభ్యర్థులను నిలబెట్టే విషయమై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అప్పుడు చెప్పారు. ఒకవేళ పోటీ చేయని పక్షంలో ఏ పార్టీకి మద్దతిస్తామో అప్పుడే తెలియజేస్తామని ఆయన అన్నారు. అదే సమయంలో తనను వేధించి, బాధించిన వారు పోయారని చెప్పడం గమనార్హం.
పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమంటుకు జరగనున్న అన్ని నియోజకవర్గాలలో తాను త్వరలో పర్యటిస్తానని కెఏ పాల్ చెప్పారు. ఎన్నికలయ్యాక పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు. కాగా కెఏ పాల్ ప్రజాశాంతి పార్టీ స్థాపించిన అనంతరం పార్టీ పరంగా కార్యక్రమాలు చేసింది తక్కువే అని చెప్పవచ్చు. అయితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో పాల్గొంటానని చెప్పడం ద్వారా తన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశ్యం ఆయనలో కనిపిస్తోంది.
-
జగన్ పై అటాక్ కు కాదేదీ అనర్హం ? తండ్రి పాదయాత్రనూ వాడేస్తున్న షర్మిల..! -
జగన్ ను సీఎం చేసేందుకు సంతకం పెట్టా.. కానీ ! కన్నా షాకింగ్..! -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
కిల్లర్ మిల్లర్.. గాయాన్ని సైతం లెక్కచేయని మొండిధైర్యం -
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు












Click it and Unblock the Notifications