ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైకోర్టులో వైయస్ అల్లుడి రక్షణ స్టీల్స్‌కు ఎదురుదెబ్బ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anil Kumar
హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని బయ్యారంలో ముడి ఇనుప ఖనిజం తవ్వడానికి అనుమతించాలంటూ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్‌కు చెందిన రక్షణ స్టీల్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తమకు కేటాయించిన బయ్యారం గనుల్లో మైనింగ్‌కు అనుమతించాలంటూ ఆ సంస్థ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ జి.చంద్రయ్య కొట్టివేశారు.

అయితే ప్రధాన కేసుగా ఉన్న గనుల లీజు జీవో నిలిపివేతపై విచారణను ఆగస్టుకు వాయిదా వేశారు. ఖమ్మం జిల్లాలోని బయ్యారం గనులను ఎపిఎండిసికి రిజర్వు చేస్తూ వైయస్ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ తర్వాత వైయస్ అల్లుడు అనిల్ కుమార్‌కు చెందిన రక్షణ స్టీల్స్‌తో ఎపిఎండిసి ఒప్పందం చేసుకుంది.

దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ప్రాంతంలోని గిరిజనుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వైయస్ తర్వాత వచ్చిన కొణిజేటి రోశయ్య ప్రభుత్వం ఆ జీవోను నిలిపివేస్తూ మరో జీవో జారీ చేసింది. అయితే బయ్యారం ప్రాంతంలో ఇనుప ఖనిజ త్వకాలకు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ(ఎపిఎండిసి)కి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించడాన్ని సవాల్ చేస్తూ రక్షణ స్టీల్స్ గతంలో పిటిషన్ దాఖలు చేసింది.

హైకోర్టుకు వెళ్లింది. మైనింగ్‌కు అనుమతించాలంటూ అనుబంధ పిటిషన్‌ను కూడా దాఖలు చేసింది. రక్షణ స్టీల్స్ పిటిషన్ పైన విచారణ జరిపిన హైకోర్టు ఆ జివోను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి నిరాకరించింది.

English summary
State High Court rejected Brother Anil Kumar's company 
 
 Rakhsana steals petition on Bayyaram mines of Khammam 
 
 district. Konijeti Rosaiah government canceled late YS 
 
 Rajasekhar Reddy's GO on Bayyaram mines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X