పెరుగుతున్న వలసలు: జగన్ పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ శాసనసభ్యుడు గ్రంథి శ్రీనివాస్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం శుక్రవారం పుచ్చుకున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ గ్రంథి శ్రీనివాస్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా గ్రంథి శ్రీనివాస్ మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలన తాను వైయస్ జగన్‌లో చూశానని చెప్పారు. అందుకే తాను వైయస్సార్ కాంగ్రెసులో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యేలు ప్రసాద రాజు, బాలరాజు తదితరులు హాజరయ్యారు. కాగా గ్రంథి శ్రీనివాస్ 2004 నుండి 2009 వరకు భీమవరం ఎమ్మెల్యేగా పని చేశారు.
కాగా చిన్న వయస్సులోనే వైయస్ జగన్‌కు ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆళ్లగడ్డ తాజా మాజీ ఎమ్మెల్యే శోభా నాగి రెడ్డి అన్నారు. ఆమె కర్నూలు జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపిలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు.












Click it and Unblock the Notifications