సుష్మా తెలంగాణ డిమాండ్‌కు స్పష్టత ఇస్తాం: చిదంబరం

తెలంగాణ ఇస్తారో, ఇవ్వరో చెప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చేసిన డిమాండ్ తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుక్కునే విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రానికి చెందిన నాలుగు పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని స్పష్టం చేసిన తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
లోకసభ నుంచి తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేయాల్సి రావడం విచారకరమని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులను సస్పెండ్ చేసినంత మాత్రాన తాము తెలంగాణకు వ్యతిరేకమని కాదని ఆయన అన్నారు. పార్లమెంటు సమావేశాలను సజావుగా నిర్వహించడానికి మాత్రమే వారిని సస్పెండ్ చేయాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. తాము తెలంగాణకు వ్యతికేరమనేది మీడియా కల్పితమని ఆయన విమర్శించారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు వాయలార్ రవి, గులాం నబీ ఆజాద్‌లతో చర్చలు జరుపుతున్నారని ఆయన చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ సమావేశాలను అడ్డుకున్న ఎనిమిది కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులను స్పీకర్ మీరా కుమార్ లోకసభ నుంచి నాలుగు రోజుల పాటు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ కాలం పూర్తయిన తర్వాత తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సోమవారం సమావేశాలను బహిష్కరించారు. సమావేశాలకు తప్పకుండా హాజరు కావాలని పార్టీ జారీ చేసిన విప్‌ను ధిక్కరిస్తూ వారు సమావేశాలను బహిష్కరించారు.












Click it and Unblock the Notifications